Salmaan Khan : తనకు లెక్కించ లేనంత ఆస్తులు , కోట్ల నగదు ఉన్నా నిద్ర సరిగా పట్టడం లేదంటూ వాపోయాడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salmaan Khan). తన మేనల్లుడు అర్హాన్ ఖాన్ పాడ్ కాస్ట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంట్లో , సినిమా షూటింగ్ లలో కంటే ఎక్కువగా తాను జైలులో ఉన్నప్పుడే హాయిగా నిద్ర పోయానంటూ పేర్కొన్నాడు. తన సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే కష్ట పడటం తప్ప ఇంకేమీ కాదన్నాడు. షార్ట్ కట్స్ లో విజయం రాదన్నాడు సల్మాన్ ఖాన్.
Salmaan Khan Comment
తన మేనల్లుడికి కూడా కీలక సూచనలు చేశాడు. ఏదో ఒక రంగం ఎంచుకోవాలి. దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని అన్నాడు. ఒకసారి కాక పోయినా మరోసారైనా గెలుపు మన దరికి చేరుతుందన్నాడు నటుడు.
కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో సినిమాలు ఉన్నా, షూటింగ్ లలో పాల్గొనేందుకు పర్మిషన్ లేక పోవడంతో చేసేది ఏమీ లేక తాను నిద్ర పోవడం పైనే ఎక్కువగా ధ్యాస పెట్టానని చెప్పాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నేను సాధారణంగా రెండు గంటలు నిద్రపోతాను. నెలకు ఒకసారి, నాకు రోజుకు 7 లేదా 8 గంటలు పడుతుంది. కొన్నిసార్లు, షూటింగ్‌ల మధ్య కొన్ని నిమిషాల విరామం దొరికినప్పుడు నిద్రపోతాను. నాకు వేరే పని లేనప్పుడు మాత్రమే నేను నిద్రపోతానని చెప్పాడు. తను 1998, 2006 , 2007లో మొత్తం 18 రోజులు జైలులో గడిపాడు.
Also Read : Hero Vijay Deverakonda :గంగమ్మ సన్నిధిలో విజయ దేవరకొండ