Salar Movie : సలార్ ఫైట్ సీక్వెల్ కోసం 750 వాహనాలు

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో ఓ ఫైట్ సీక్వెల్ కోసం ఏకంగా 750 వాహనాలు.

Hello Telugu - Salar Movie

Salar Movie : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాకు సంబందించిన ఓ ఇంటరెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేస్తుంది. కేజిఎఫ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పూర్తి స్థాయి డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్లకు లోటు ఉందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రభాస్ అభిమానుకు కిక్కెక్కించే అప్ డేట్ బయటకు వదిలారు.

Salar Movie Updates

అదేమిటంటే “సలార్(Salar Movie)” సినిమాలో ఓ ఫైట్ సీక్వెల్ కోసం వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా 750 వాహనాలను వాడుతున్నట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ సిరీస్ తరహలో జీపులు, ట్యాంకర్లు, ట్రక్కులు, ప్రొక్లెయిన్స్ మొత్తం అన్ని కలిపి దాదాపు 750 వాహనాలను కేవలం యాక్షన్ సీక్వెన్స్ ల కోసమే వాడారని అంటున్నారు. దీనితో “సలార్” సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పై అంచానాలు పెరిగిపోతున్నాయి. కేజిఎఫ్ సిరీస్ తో యాక్షన్ ఎపిసోడ్స్ లో కొత్తవరవడిని పరిచయం చేసిన ప్రశాంత్ నీల్… ఇప్పుడు బాహుబలి ప్రభాస్ తో కలిపి ప్రేక్షకులకు ఎలాంటి విజువల్ ట్రీట్ ఇస్తారో అని ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

డిసెంబరు 22న సలార్

కేజిఎఫ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రభాస్ కి ప్రతినాయకుడి గా పృథ్వీరాజ్ సుకుమారన్…. వరదరాజమన్నార్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన తండ్రి పాత్రలో జగపతిబాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం షూట్ చేసిన దాదాపు అన్ని యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వాటి విఎఫ్ఎక్స్ కోసమే సినిమా వాయిదా వేశారని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది.

Also Read : Japan Movie : కార్తీ సినిమా ప్రమోషన్ లో నాని

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com