Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా… ‘కేజీఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ట్రైలర్ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో… చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ‘సలార్’ మూవీ టికెట్స్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటిస్తేనే ఓ కండీషన్ పెట్టింది. ఇదే విషయాన్ని తమ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది.
Salaar – ‘సలార్’ ట్రైలర్ కౌంట్‌డౌన్ స్టార్ట్… అభిమానులకు హోంబలే ఫిల్మ్స్ బంపర్ ఆఫర్
‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్(Salaar)’ సినిమా ట్రైలర్ ను డిసెంబరు 1న సాయంత్రం 7:19 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. దీనితో ‘సలార్’ ట్రైలర్ వచ్చేందుకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది.
‘సలార్’ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ ఫొటో ఒకటి ట్విట్టర్ పోస్ట్ చేసి… దీనికి మంచి క్యాప్షన్ చెప్పిన ఓ ఐదుగురికి… వాళ్ల ఏరియాలోని ఓ థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తో పాటు మూవీ పేరున్న టీ-షర్ట్‌ని ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీనితో హోంబలే ఫిల్మ్స్ ఇచ్చిన ఆఫర్ ను వినియోగించుకోవడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు. రకరకాల క్యాప్షన్స్ తో హోంబలే ఫిల్మ్స్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు.
Also Read : Salaar: ‘సలార్’ స్టోరీని లీక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్