ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , శ్రుతీ హాసన్ కలిసి నటించిన సలార్ చిత్రం విడుదలపై ఉత్కంఠకు తెర దించారు మూవీ మేకర్స్. ఈ మేరకు నిన్నటి దాకా అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 22న కన్ ఫర్మ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సలార్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సీక్వెల్ మూవీలో నటించాడు. మంచి మార్కులు పడ్డాయి. ఇక డార్లింగ్ ప్రభాస్ కు ఈ సలార్ మూవీ చాలా ముఖ్యం. కారణం ఎందుకంటే ఆయన నటించిన రాధే శ్యామ్ , ఆది పురుష్ చిత్రాలు ఆశించిన మేర ఆడలేదు.
దీంతో ఇప్పుడు విడుదలయ్యే సలార్ పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. ప్రత్యేకించి సినీ రంగానికి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ఫ్యాన్స్ పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఏది ఏమైనా టేకింగ్ లో మేకింగ్ లో దర్శకుడి ప్రతిభకు పెట్టింది పేరు.
మరో వైపు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన డుంకీ మూవీ కూడా సలార్ కు పోటీగా రానుందని టాక్. దీంతో సలార్ ను ఆ సినిమా కంటే ముందే విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. మొత్తంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ గుడ్ న్యూస్ చెప్పారు ప్రభాస్ ఫ్యాన్స్ కు.