Salaar Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల వాయిదా పడింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ , నయన తార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి నటించిన జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే టికెట్లు అయిపోయాయి ఓవర్సీస్ లో. ఇది ఓ రికార్డు.
Salaar Movie Release Postponed
సలార్ ను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీశాడు. అంతకు ముందు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ లో నటించాడు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో డార్లింగ్ ప్రశాంత్ నీల్ పై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. మరో వైపు నాగ్ అశ్విన్ బిగ్ బడ్జెట్ ఫిలింలో నటిస్తున్నాడు.
సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని సలార్(Salaar Movie) ను భావించారు మూవీ మేకర్స్. కానీ జవాన్ ఎఫెక్ట్ ఉండడం వల్లనే నవంబర్ కు వాయిదా వేశారని సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ నీల్ చెప్పినట్లు సినిమాకు సబ్జెక్టు ముఖ్యమని, కానీ హీరోలు ముఖ్యం కాదన్నాడు.
ఇప్పటికే ఆయన యశ్ తో తీసిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 దేశాన్ని ఉర్రూత లూగించింది. కోట్లు కొల్లగొట్టింది. ప్రశాంత్ నీల్ టేకింగ్ కు జనం ఫిదా అయ్యారు. గతంలో ఏ దర్శకుడికి రానంతటి క్రేజ్ ప్రశాంత్ నీల్ కు దక్కింది. కాగా ఒకసారి ప్రకటించాక తిరిగి వాయిదా వేయడం ఎందుకని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Also Read : Samantha Ruth Prabhu : సమంత బిగ్ ఛాన్స్ మిస్