దమ్మున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. టేకింగ్ లో తన సత్తా ఏమిటో ఇప్పటికే చూపించాడు యశ్ తో తీసిన కేజీఎఫ్ లో. ఆ మూవీ రికార్డుల మోత మోగించింది. గతంలో ఉన్న రికార్డులను తిరగ రాసింది. కేజీఎఫ్ సక్సెస్ తో సీక్వెల్ గా కేజీఎఫ్2 తీశాడు. అది కూడా కొత్త చరిత్ర సృష్టించింది.
ఇక పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన డార్లింగ్ ప్రభాస్ తో ప్రస్తుతం సలార్ చిత్రం తీశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయినట్లు టాక్. ఇక విడుదల చేసిన పోస్టర్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు.
అయితే సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పదే పదే సినిమా రిలీజ్ డేట్స్ ను వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు ఎట్టకేలకు సినిమాకు సంబంధించి విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 22న మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇక సినిమా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ తో పాటు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతీ హాసన్ తోడుగా నటించనుంది. ఇక సంజయ్ దత్ ముఖ్యమైన రోల్ లో నటిస్తుండడం విశేషం. మొత్తంగా సినిమా కు సంబంధించి అప్ డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు.