Salaar Movie : అందరి కళ్లు ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పై ఉన్నాయి. కారణం ఆయన నటించిన ఆది పురుష్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ దుమ్ము రేపుతోంది. ఇక సినిమాల రేంజ్ పక్కన పెడితే ప్రభాస్ స్టామినా , ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా ఉండదు.
Salaar Movie People are Waiting
అందుకే పాన్ ఇండియా స్టార్ ను ఎలా వాడు కోవాలో తనకు బాగా తెలుసు కనుకనే ఏరికోరి ప్రభాస్ ను ఒప్పించాడు. ఇక ప్రశాంత్ నీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడా పబ్లిసిటీ కోరుకోని ఈ దర్శకుడు చాలా లో ప్రొఫైల్ ఇష్ట పడతాడు.
ఆయన కన్నడ స్థార్ యశ్ తో తీసిన కేజీఎఫ్ , కేజీఎఫ్-2 భారతీయ సినిమాను షేక్ చేశాయి. ఆ తర్వాత వస్తున్న చిత్రం ప్రభాస్ సలార్(Salar). భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అతడి టేకింగ్, మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే డార్లింగ్ అభిమానులు భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
అది ప్రశాంత్ నీల్ తో పూర్తవుతుందని ఆశిస్తున్నారు. ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఇక సలార్ మేనియా యుఎస్ లో మామూలుగా లేదు. ఇప్పటి వరకు ముందస్తుగా టికెట్లు అమ్ముడు పోతుండడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. 290 ప్రాంతాలలో, 848 షోస్ తో ప్రదర్శించనున్నారు సలార్ ను. 11,639 టికెట్లు ముందస్తుగా అమ్ముడు పోవడం విశేషం.
Also Read : Shah Rukh Khan USA : యుఎస్ లో షారుక్ ఖాన్ మేనియా