Salaar Collections: ‘కేజీయఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘సలార్(Salaar)’. 2023 డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గత ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన 18 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటినట్లు తాజాగా ప్రముఖ సంస్థ Sacnilk గణాంకాలు చెబుతున్నాయి. కేవలం భారత్‌లో ఈ సినిమా రూ. 400 కోట్ల మార్క్‌ను చేరుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. దీనితో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. బాక్సాఫీస్ కా బాప్… ప్రభాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Salaar Collections Viral
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన సలార్ మూవీ.. ఇక ఇప్పుడు స్పెయిన్, జపాన్‌లోనూ రిలీజ్ కానుంది. స్పానిష్ భాషలో లాటిన్ అమెరికాలో మార్చి 7న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనితో ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేయడం ఖాయమంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. అయితే సినిమా విడుదలలై మూడు వారాలు అయినా సక్సెస్‌ఫుల్‌గా చాలా థియేటర్ లలో సలార్ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సలార్ సక్సెస్‌ను తాజాగా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్‌లోని మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Nanu Hi Nanna: ఓటీటీలో అదరగొడుతోన్న నాని ‘హాయ్ నాన్న’