Sakshi Vaidya : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డేకు ఈ ఏడాది కొంత నిరాశ కలిగించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం ఓపెనింగ్ లో కనిపించింది.
Sakshi Vaidya to be in Ustad Bhagat Singh
ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆమె తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఎందుకు తప్పుకుందనేది ఇప్పటి వరకు తెలియదు. ఇదే సమయంలో మరో దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. పూజా హెగ్డేను కీ పాత్రలో నటిస్తుందని టాక్.
విచిత్రం ఏమిటంటే పూజాను కాకుండా శ్రీలీలను తీసుకున్నాడు. మరో పాత్రలో కొత్తగా సాక్షి వైద్యను(Sakshi Vaidya) తీసుకున్నట్లు టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇద్దరు దిగ్గజ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ , హరీశ్ శంకర్ కు పూజా హెగ్డేతో సినిమాలు తీయడం ఓ సెంటిమెంట్ గా భావిస్తారు.
కానీ ఉన్నట్టుండి ఎందుకని పూజా హేగ్డే మిస్ అయ్యిందనేది ఇప్పటి వరకు తెలియడం లేదు. మరో వైపు మహేష్ బాబు తాజాగా తాను నటిస్తున్న గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందని ప్రకటించాడు. షూటింగ్ కొనసాగుతోంది. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Chari 111 Movie : వెన్నెల కిషోర్ హీరో గా మూవీ