Sajid Nadiadwala: బాలీవుడ్ సీనియర్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా(Sajid Nadiadwala)… సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేతులు కలిపారు. వీరిద్దరూ కలసి ఓ కొత్త సినిమా చేయబోతున్నట్లు నిర్మాత సాజిద్… మంగళవారం తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తూ… ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసారు. అయితే ఈ సినిమా తమిళంలో రూపొందిస్తారా ? హిందీలో చేస్తారా ? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీనితో సినీవర్గాలు, ప్రేక్షకుల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటివరకూ దక్షిణాది, ఉత్తరాది, హాలీవుడ్ మూవీ (బ్లడ్ స్టోన్) కలుపుకుని దాదాపు 170 చిత్రాల్లో నటించారు.
ఇప్పుడు బాలీవుడ్ అగ్రనిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో ‘హౌస్‌ఫుల్ సిరీస్, 2 స్టేట్స్, హీరో పంతి, కిక్, సూపర్ 30, ఛిచోరే, 83’ తదితర చిత్రాలతో పాటు రీసెంట్ హిట్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రం నిర్మించారు సాజిద్ నడియాడ్‌వాలా. అంతేకాదు ‘హౌస్‌ఫుల్, హౌస్‌ఫుల్ 2, కిక్’ వంటి చిత్రాలకు సాజిద్ దర్శకత్వం వహించారు..
Sajid Nadiadwala Movie With Rajinikanth
‘దిగ్గజ నటుడు రజనీకాంత్‌తో కలిసి పని చేయడం నాకొక గౌరవం. మర్చిపోలేని మా ప్రయాణం మొదలు కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం’ అంటూ సాజిద్ తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసారు. దీనిపై ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ సైతం స్పందించారు. ‘రజనీకాంత్-సాజిద్ నడియాడ్‌వాలా కలిసి మొదటిసారి ఓ చిత్రం చేయనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు’ అని పేర్కొన్నారు. దీనితో నిర్మాత సాజిద్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆల్ ది బెస్ట్… సాజిద్ అండ్ తలైవా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మీ కాంబోలో వచ్చే సినిమా హాలీవుడ్ స్థాయిలో విజయం సాధించాలంటూ ఆకాంక్షిస్తూ మెసేజ్ లు చేస్తున్నారు.
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్… ఇటీవల వచ్చిన లాల్ సలామ్ లో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసారు. అయితే లాల్ సలామ్ లో రజనీది అతిథి పాత్ర అని మొదటి నుండి చెప్పడంతో ఆ ప్రభావం పెద్దగా నెక్ష్ట్ సినిమాపై ఉండదని అభిమానులు అంటున్నారు.
Also Read : Om Bheem Bush Movie : ఈ సినిమాను టాలీవుడ్ లో రిలీజ్ చెయ్యాలనుకున్నారట