Saira banu : బాలీవుడ్ – ప్రముఖ దిగ్గజ నటి సైరా బాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పై ప్రశంసలు కురిపించారు. తాను సెప్టెంబర్ 7న విడుదలైన బాద్ షా నటించిన జవాన్ సినిమాను చూశానని తెలిపారు. రెండు పాత్రలలో అద్భుతంగా నటించాడని కితాబు ఇచ్చారు. ఇందుకు ప్రత్యేకించి దర్శకుడు అట్లీ కుమార్ ను తాను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నానని పేర్కొన్నారు సైరా బాను.
Saira banu Praises Shah Rukh Khan
బాద్ షా ఖాన్ ను చూస్తూ ఉంటే తనకు తన ప్రియుడు, భర్త దిలీప్ కుమార్ గుర్తుకు వచ్చాడని అభిప్రాయపడ్డారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ విషయాన్ని ఆదివారం పంచుకున్నారు. ప్రస్తుతం సైరా బాను(Saira banu) పేర్కొన్న కామెంట్స్ కలకలం రేపాయి. గతంలో ఎన్నోసార్లు కలుసుకున్నాం. కానీ ఎక్కడా మార్పు రాలేదు షారుక్ ఖాన్ లో అని పేర్కొన్నారు .
అప్పుడు ఇప్పుడు కూడా తన కాళ్లను మొక్కాడు. పెద్దల పట్ల, తనకంటే ముందున్న నటీ నటుల పట్ల షారుక్ ఖాన్ కు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమైందని ఈ సందర్బంగా మరోసారి గుర్తు చేసుకున్నారు సైరా బాను. అతడు పరిపూర్ణమైన నటుడు. తనకు అతడి పట్ల ఎల్లప్పటికీ ప్రేమ పూర్వకమైన అభిమానం ఉంటుందన్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా షారుక్ తప్పకుండా హాజరవుతాడని తెలిపారు.
Also Read : Shiva Raj Kumar : శివన్న క్రేజ్ మాములుగా లేదుగా