Saipallavi: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైయింది. సాయి పల్లవి సోదరి, నటి పూజ కన్నన్… వినీత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్క సాయిపల్లవి(Saipallavi) కంటే ముందే పెళ్ళికి సిద్ధమైపోయింది పూజ. త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్న పూజ-వినీత్ లు నిశ్చితార్ధం అతి త్వరలో చేసుకోబోతున్నారు. దీనితో ఎంగేజ్ మెంట్ కు ముందు సెలబ్రేషన్స్ లో భాగంగా పూజ తన సోదరి సాయిపల్లవితో కలిసి మెహందీ పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో (ఇన్ స్టా) షేర్ చేసింది. ఈ ఫోటోల్లో మెహందీ పెట్టుకుని అక్కా చెల్లెల్లు చిరునవ్వులు చిందిస్తున్నారు. దీనితో పూజకు నెటిజన్లు ఇప్పటినుండే పెళ్ళి శుభాకాంక్షలు చెప్తుండగా… ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Saipallavi Sister Marriage
సాయిపల్లవి సోదరిగా పూజ కన్నన్… ‘చితిరై సెవ్వానం’తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నటనకు పూజ ప్రశంసలు అందుకున్నప్పటికీ… ఆ తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఇంతలోనే తన స్నేహితుడు వినీత్ తో ప్రేమలో పడిన పూజ… స్నేహితుడే జీవిత భాగస్వామి కాబోతున్నాడంటూ ఇటీవల ఇన్ స్టా వేదికగా తన కాబోయే భర్త వినీత్ గురించి వెల్లడించింది. అయితే అక్క సాయిపల్లవి పెళ్ళి చేసుకోకుండానే పూజ పెళ్ళి చేసుకుంటుందా అనే సందేహంతో వీరి ప్రేమాయణం మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇరు వర్గాల కుటుంబీకులు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో… అక్క సాయిపల్లవి కంటే ముందే చెల్లి పూజ పెళ్ళి పీటలెక్కబోతుందన్నమాట.
Also Read : Porn Star Shakeela: నటి షకీలాపై పెంపుడు కుమార్తె దాడి !