Saindhav : సెల్ ఫోన్, మద్యం, డబ్బును రాంగ్ యూసేజ్ చేస్తూ జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నాడు విక్టరీ వెంకటేష్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వెంకటేశ్ హీరోగా దర్శకుడు శైలేశ్ కొలను తెరకెక్కించిన సినిమా ‘సైంధవ్(Saindhav)’. తమిళ నటుడు ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ ను ప్రారంభించిన ‘సైంధవ్’ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని సీఎంఆర్ కాలేజీలో ‘రాంగ్ యూసేజ్’ అనే పాటను విడుదల చేసింది. ఈ ‘రాంగ్ యూసేజ్’ పాట ద్వారా వెంకటేష్… ఓ మంచి మెసేజ్ ను ఇస్తున్నట్లు అర్ధమౌతోంది. చంద్రబోస్ రచించిన ఈ పాటకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Saindhav Movie Updates
ఇక ‘రాంగ్ యూసేజ్’ పాట విషయానికొస్తే.. సెల్‌ఫోన్, మందు, డబ్బును రాంగ్ యూసేజ్ చేయడం ద్వారా కష్టాలను రెట్టింపు చేసుకుంటున్నామంటూ గీత రచయిత చంద్రబోస్ తనదైన శైలిలో లిరిక్స్ రాసారు. దానికి సంతోష్ నారాయణ్ అద్భుతమైన బాణీలు సమకూర్చారు. బాధనైన, సంతోషాన్నైనా… మందు డబుల్ చేస్తుంది. కాబట్టి బాధను రెట్టింపు చేసుకోవడానికి మందును రాంగ్ యూసేజ్ చేయ్యొద్దు… దునియాలో అందరికీ దగ్గరవవ్వడానికి కనిపెట్టింది ఈ సెల్ పోన్… దీనిని రాంగ్ యూసెజ్ చేసి సెల్ ఫోన్ తో ఒంటరిగా మిగిలిపోకూడదు… అలాగే డబ్బు అవసరాల కోసం వాడుకోవాలి మనుషులను లవ్ చేయాలి… కాని డబ్బును రాంగ్ యూసేజ్ చేసి మనుషులను దూరం చేసుకోకంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
వెంకటేష్ గత చిత్రం గురు సినిమాలోని జింగిడి జింగిడి సాంగ్… ఇటీవల కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్ లోని మత్తుగ.. మత్తుగ.. మందు మత్తుగ వంటి సాంగ్ ల నేపథ్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాట ద్వారా వెంకటేష్ మంచి మెసేజ్ ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Seerat Kapoor: అల్లు అర్జున్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న బాలీవుడ్ బ్యూటీ