Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ‘దేవర(Devara)’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు.రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్టును సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Devara Movie Updates
ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్, సైఫ్ అలీఖాన్ స్టైలిష్ విలనిజం, కొరటాల శివ కన్విన్సెంగ్ టేకింగ్ ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, ప్రేక్షకులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు. ఈ గ్లింప్స్ బట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని ఈ వీడియోతో ఓ క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో ఐరన్ థ్రోన్ ని పోలినట్లు ‘దేవర’లోనూ ఓ సింహాసనం చూపించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : Thangalaan 2: త్వరలో విక్రమ్ ‘తంగలాన్ 2’ ?