Jr NTR : హైదరాబాద్ – ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR). ఇవాళ తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలో సైఫ్ ఆగంతకుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు. తన భార్య నటి కరీనా కపూర్ తో పాటు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి దూరాడు.
Jr NTR Tweet…
తను దొంగతనానికి వచ్చాడని, మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా కత్తితో దాడి చేశాడంటూ వాపోయారు భార్య కరీనా కపూర్. విషయం తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉందంటూ వాకబు చేశారు. ప్రస్తుతం ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్.
ఆయన త్వరగా కోలుకోవాలని, తనకు అత్యంత కావాల్సిన మిత్రుడంటూ పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్. డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జాహ్నవి కపూర్ తో కలిసి తను నటించిన దేవర 1 మూవీలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించాడు సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు సైతం త్వరగా కోలుకోవాలని కోరారు.
Also Read : Saif Ali Khan Attack – Kareena : తన భర్త ఆరోగ్యంగా ఉన్నాడన్న కరీనా