Saif Ali Khan Discharged from Hospital: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ ! ‘దేవర’ రిలీజ్ పై డౌట్స్ ?

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ ! 'దేవర' రిలీజ్ పై డౌట్స్ ?

Hello Telugu - Saif Ali Khan Discharged from Hospital

Saif Ali Khan: మోకాలు, భుజం నొప్పితో బాధపడుతూ… చికిత్స కోసం ముంబైలోని కోకిలా బెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో చేరిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న సైఫ్ అలీఖాన్ కు మైనర్ సర్జరీ చేసి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. దీనితో భుజానికి కట్టు వేసుకుని తన భార్య కరీనా కపూర్ తో కలిసి ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న సైఫ్ అలీఖాన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనితో సైఫ్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా గెట్ వెల్ సూన్ సైఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Saif Ali Khan Health Updates

స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరక్కిస్తున్న ‘దేవర’ సినిమాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-సైఫ్ ల మధ్య యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించిన సమయంలో జరిగిన ప్రమాదంలో సైఫ్ కు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసాయి. అయితే ‘దేవర’ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు అటు సైఫ్ నుండి కాని… ఇటు సినిమా యూనిట్ నుండి గాని ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

అయితే సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో జాయిన్ కావడం వెనుక గల కారణాలను… డిశ్చార్జ్ అయిన తరువాత నిర్వహించిన జూమ్ మీటింగ్ లో సైఫ్ అలీఖాన్ వెల్లడించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ చాలా ఏళ్ళ క్రితం జరిగిన ప్రమాదంతో భుజం, మోకాలకు గాయాలయ్యాయని… అయితే ఇటీవల దేవర సినిమాలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఆ గాయం మరల తిరగబడినట్లు తెలిపారు. ఎందుకైనా మంచిదని స్కానింగ్ చేయించుకుంటే గాయం తీవ్రత బయటపడిందని, అయినప్పటికీ దేవర షూటింగ్ పూర్తిచేసి, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు సైఫ్ వెల్లడించాడు. దీనితో సోమవారం హాస్పిటల్ లో జాయిన్ అయిన తనకు మంగళవారం మైనర్ సర్జరీని పూర్తి చేసి డాక్టర్స్ డిశ్చార్జ్ చేసారని తెలిపారు. కాకపోతే వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారన్నారు. దీనితో సైఫ్ అలీఖాన్ కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు.

‘దేవర’ రిలీజ్ పై డౌట్ ?

సైఫ్ అలీఖన్ ను నెల రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో… దేవర(Devara) సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. దేవర పార్ట్ -1 ను ఏప్రిల్ 5 న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న సైఫ్ కు నెల రోజుల రెస్ట్ ఇవ్వడమంటే చాలా కష్టం కాబట్టి ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన దేవర సినిమా వాయిదా పడుతుందనే ఉహాగానాలు ఎక్కువయ్యాయి. దీనికి సైఫ్ గాయం మాత్రమే కారణం కాదని సినిమాకు సంబంధించి మరికొంత పోర్షన్ ఇంకా మిగిలి ఉందని సమాచారం. వచ్చే నెల రోజుల్లో ఆ షూటింగ్ పూర్తిచేయడం సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో… పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న దేవరను ఆ టైమ్ లో విడుదల చేయడం కరెక్ట్ కాదని యూనిట్ భావిస్తోందట.

Also Read : Ananya Pandey: బాలీవుడ్ బ్యూటీ ప్రైవేటు ఫొటోలు లీక్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com