Saiee Manjrekar: సల్మాన్‌ మాటే శాసనం అంటున్న ఏకలవ్య శిష్యురాలు సయీ మంజ్రేకర్‌ !

సల్మాన్‌ మాటే శాసనం అంటున్న ఏకలవ్య శిష్యురాలు సయీ మంజ్రేకర్‌ !

Hello Telugu - Saiee Manjrekar

Saiee Manjrekar: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్‌ 3’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సయీ మంజ్రేకర్… ‘మేజర్‌’, ‘గని’, ‘స్కంద’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. నటుడు, దర్శకుడు, నిర్మాత మహేశ్ మంజ్రేకర్ వారసురాలిగా ‘కాక్ స్పర్శ్’ సినిమాతో బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సయీ మంజ్రేకర్… 2019లో ‘దబాంగ్‌ 3’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘దబాంగ్‌ 3’లో చిన్న పాత్ర అయినప్పటికీ మొదటి సినిమాలోనే స్టార్ హీరోతో కలిసి నటించడం అదృష్టంగా భావించింది. దీనితో ‘దబాంగ్‌ 3’లో అవకాశం ఇచ్చిన సల్మాన్ ఖాన్ ను తన గురువుగా చెప్పుకుంటూ వస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Saiee Manjrekar Comment

‘నేను చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనే నా గురువు’ అని అంటోన్న సయీ మంజ్రేకర్(Saiee Manjrekar)… తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ‘నేను ‘దబాంగ్‌ 3’తో ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అందులో ప్రధాన పాత్రలో మెప్పించిన సల్మాన్‌ అప్పటి నుంచి నా గురువు, మార్గదర్శి. అందులో నేను తక్కువ నిడివిగల పాత్ర చేసినా అగ్రతారతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. చిత్రపరిశ్రమకి అప్పుడే కొత్తగా వచ్చిన వారికి ఇంత కంటే గొప్ప అవకాశం ఏది లేదని నా అభిప్రాయం. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. నేను ఏ కొత్త సినిమా కోసం సంతకం చేసినా ఇప్పటికీ ఆయనకి తప్పకుండా చెప్తాను’ అంటూ తెలిపింది. ఏకలవ్య శిష్యురాలిగా సల్మాన్ అనుమతి లేకుండా ఏ పని చేసేది లేదని అంటోంది. అదే సమయంలో తన వృత్తిపరమైన నిర్ణయాలలో తన తండ్రి, దర్శకనిర్మాత మహేశ్‌ మంజ్రేకర్‌ ఎప్పుడూ జోక్యం చేసుకోరని, ఉత్తమమైన సలహాలిస్తాడని చెప్పకొచ్చింది.

Also Read : Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ సెన్సార్ కంప్లీట్…ఏ సర్టిఫికెట్ ఇచ్చారా…?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com