Sai Pallavi : తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం వేడుకగా జరిగింది. తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఫిల్మ్ రివ్యూ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఈ వేడుకను అంగరంగా వైభవంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇందులో అమరన్ సినిమాలో ఇందు రెబెకా వర్గీస్ పాత్రకుగానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది సాయి పల్లవి(Sai Pallavi). అలాగే మహారాజా సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు విజయ్ సేతుపతి. ఈ వేడుకలను చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. చెన్నైలో గత 22 ఏళ్లుగా ఈ ఉత్సవం జరుగుతోంది. తమిళంలో విడుదలైన ప్రధాన చిత్రాలే కాకుండా ప్రపంచ భాషల్లో విడుదలైన అనేక చిత్రాలు కూడా ప్రదర్శిస్తారు.
Sai Pallavi Got Award
ఈ ఏడాదికి సంబంధించిన ఫిల్మ్ ఫెస్టివల్ 12న ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగింది. ఈ ఫెస్టివల్‌లో దాదాపు 180 సినిమాలు ప్రదర్శించారు. ఇందులో అమరన్ సినిమాకు ఉత్తమ నటిగా సాయి పల్లవి(Sai Pallavi).. మహారాజా సినిమాకు ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. “22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప సినిమాలు విడుదలయ్యాయి. అందులో నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. నాపై అభిమానులు చూపించే ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంటుంది. ముకుంద్ కుటుంబసభ్యులు, ఆయన భార్య వల్లే ఇది సాధ్యమైంది. దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ఒక జవాను కథ ఇది. రాజ్ కుమార్ పెరియాసామి వంటి దర్శకులే ఇలాంటి కథలను మనకు అందించగలరు ” అంటూ చెప్పుకొచ్చింది.
చెన్నైఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే..
ఉత్తమచిత్రం : అమరన్
రెండోచిత్రం : లబ్బర్ పందు
ఉత్తమనటుడు : విజయ్ సేతుపతి (మహారాజా)
ఉత్తమనటి : సాయి పల్లవి (అమరన్)
ఉత్తమసినిమాటోగ్రాఫర్ : సీహెచ్ సాయి (అమరన్)
ఉత్తమఎడిటర్ : ఫిలోమిన్ రాజ్ (అమరన్)
ఉత్తమబాలనటుడు : పొన్నెల్ (వాళై)
ఉత్తమసహాయనటుడు : దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమసహాయ నటి : దుషారా విజయన్ (వేట్టయన్)
ఉత్తమరచయిత : నిథిలన్ సామినాథన్ (మహారాజా)
ఉత్తమసంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ (అమరన్)
స్పెషల్జ్యూరీ అవార్డ్ : మారి సెల్వరాజ్ (వాళై), పా. రంజిత్ (తంగలాన్)
Also Read : Hero Upendra : కన్నడ హీరో ఉపేంద్ర కు షాక్ ఇచ్చిన ఓ కుర్రాడు