Sai Pallavi : శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా విశ్వనటుడు కమల్ హాసన్కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం అమరన్(Amaran). నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి శివ కార్తికేయన్ లుక్, ఓ పాటను రిలీజ్ చేయగా తాజాగా సాయి పల్లవి పోషించిన ఇందు ముకుంద్ ఇంట్రోను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Sai Pallavi Movie Updates
ఈ వీడియో సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతుంది. ఈ ఇంట్రోలో మేజర్ ముకంద్ వీర మరణానంతరం భార్య ఇందు (సాయి పల్లవి)కి ప్రభుత్వం పురస్కారం అందజేసే నేపథ్యంలో ప్రారంభమై ముకుంద్‌తో ఇందు, ప్రేమ, సాన్నిహిత్యం కుటుంబం గురించిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ ట్రైలర్‌ను చూశాక సినిమాలో సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను బాగానే కంటతడి పెట్టిస్తుందనేలా ఉంది. ఇదిలా ఉండగా ఈ ‘అమరన్’ మూవీ తెలుగు ఏపీ, టీఎస్‌ల థియేట్రికల్ హక్కులను హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతని సోదరి నిఖితారెడ్డిల శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఈ సంస్థ కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. రాబోయే దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని ‘మేజర్ వరదరాజన్’ కథ ఆధారంగా రూపొందించబడుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Devara-1 Review : జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘దేవర’ రివ్యూ