బహు భాషా చిత్రాలలో నటిస్తూ సహజ సిద్దమైన పాత్రల్లో జీవిస్తూ దూసుకు పోతోంది నటి సాయి పల్లవి. తాజాగా జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రస్తుతం దేశంలో భక్తి సినిమాల హవా కొనసాగుతోంది.
మొన్నటికి మొన్న కృతీ సనన్ ప్రభాస్ తో ఆది పురుష్ లో నటించింది. అది ఆశించిన మేర ఆడలేదు. ఇక దంగల్ సినిమాతో రికార్డ్ బ్రేక్ చేసిన దర్శకుడు నితీష్ తివారీ సంచలన ప్రకటన చేశాడు. ఆయన కొత్త ప్రాజెక్టు రామాయణం పేరుతో సినిమా ఓకే చేశాడు.
ఇందుకు సంబంధించి సీతగా ఎవరిని తీసుకుంటాడనే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాను సీత పాత్రకు హీరోయిన్ ను ఎంపిక చేయడం జరిగిందని ప్రకటించాడు. మలయాళ కుట్టి సాయి పల్లవి అయితే సీతకు సరిగ్గా సరి పోతుందని స్పష్టం చేశాడు దర్శకుడు.
దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ సహజ నటి. కేవలం ప్రాధాన్యత కలిగిన పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది సాయి పల్లవి. ఆమె హిందీలో ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తనయుడితో లవ్ స్టోరీ కథాంశంతో వచ్చే చిత్రంలో నటిస్తోంది.
ప్రస్తుతం జాక్ పాట్ కొట్టేసింది సాయి పల్లవి. ఆమెకు తోడుగా రామాయణంలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండడం విశేషం.