Thandel : తిరుమలలో తండేల్ చిత్ర బృందం సందడి చేసింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న విడుదలైంది. ఇప్పటికే రూ. 75 కోట్లకు పైగా వసూలు సాధించింది. పెట్టిన రూ. 50 కోట్లు రావడంతో సినీ నిర్మాతలు , మూవీ మేకర్స్ సంతోషంలో మునిగి పోయారు.
Thandel Team Visit Tirumala
ఊహించని రీతిలో తండేల్(Thandel) చిత్రం సక్సెస్ కావడంతో నటీ నటులు సాయి పల్లవి, నాగ చైతన్య, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, సాంకేతిక నిపుణులు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆ స్వామి వారి కృప వల్లనే తమ సినిమా విజయవంతం అయ్యిందన్నారు. నిర్మాత సినిమా విడుదలకు ముందు తిరుమల సన్నిధికి వచ్చారు. సక్సెస్ అయితే టీంతో సహా వస్తామని మొక్కుకున్నారు. అందుకే ఇవాళ ఆ కలియుగ దైవ సన్నిధిలో ఉన్నామని చెప్పారు దర్శకుడు చందు మొండేటి.
కాగా తండేల్ చిత్రం తమ ఒక్కరి వల్లనే సక్సెస్ కాలేదని, ప్రతి ఒక్కరు ఇందులో వంద శాతం మనసు పెట్టి చేశారని పేర్కొన్నారు వినమ్రంగా నటీ నటులు సాయి పల్లవి, నాగ చైతన్య. ఈ సక్సెస్ లో క్రెడిట్ ఇవ్వాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని ప్రశంసలు కురిపించారు.
Also Read : Hero Vishwak Sen :సినిమాలంటే ప్రాణం కాంట్రవర్సీలకు దూరం