Sai Pallavi: యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కేజిఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యశ్. ‘కేజిఎఫ్ ఛాప్టర్ 2’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో యశ్… తన తరువాత సినిమాకు సంబందించిన వివరాలు డిసెంబరు 8న వెల్లడించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనితో ఆ సినిమాకు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా అది వైరల్‌గా మారుతోంది. మొదట దర్శకుని విషయంలో… ఆ తరువాత మాదక ద్రవ్యాలకు సంబంధించిన కథ అంటూ ఈ సినిమాపై తెగ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఆ సినిమాలో యశ్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. యశ్ సరసన సాయి పల్లవి నటిస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Sai Pallavi – త్వరలో పట్టాలెక్కనున్న ‘యశ్19’ సినిమా
కే.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘యశ్19’ సినిమాకు ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజిఎఫ్’ సిరీస్ తరువాత వస్తున్న సినిమా కావడంతో… పాన్ ఇండియా అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో యశ్ సరసన సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి(Sai Pallavi) రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు చేస్తోంది. ఇప్పుడు ఇది కూడా ఓకే అయితే వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో ఆమె కనిపిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Also Read : Surya-Karthi: మిగ్ జాం తుఫాన్ బాధితులకు సూర్య, కార్తిల సహాయం