సినిమా రంగంలో ఎవరు ఎప్పుడు హైలెట్ అవుతారో చెప్పలేం. సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి పెళ్లి చేసుకుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
నెట్టింట్లో సాయి పల్లవికి చెందిన పెళ్లి ఫోటో ఒకటి చక్కర్లు కొట్టింది. దీంతో సాయి పల్లవి ఈ మొత్తం వ్యవహారం, ప్రచారానికి సంబంధించి స్పందించింది. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.
ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఇలా ఉండాల్సి వచ్చింది. దానిని తీసి ప్రచారం చేశారు. ఇది ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదని పేర్కొంది సాయి పల్లవి. ఇలా పుకార్లు వ్యాప్తి చేయడం అత్యంత నీచం, బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది నటి.
నటుడు, దర్శకుడు రాజ్ కుమార్ పెరియ సామిని పెళ్లి చేసుకున్నానంటూ ఫోటోలు షేర్ చేయడం మంచి పద్దతి కాదని సూచించింది. కొత్త చిత్రం ఎస్కే 21కు సంబంధించిన పూజా వేడుకలో దిగిన ఫోటో అది అని తెలిపింది సాయి పల్లవి.