Sai Durgha Tej : సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, జనసైనికుల్లో ఆనందానికి అవధులు లేవు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ శాసనసభలో 21 స్థానాలు, లోక్ సభలో రెండు స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా విజయం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలను ప్రదానం చేయడంతో ఈ ఆనందం రెట్టింపయింది.
Sai Durgha Tej Gift
చిరంజీవి భార్య సురేఖ అత్యంత ఖరీదైన పెన్నును పవన్‌కు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన గురువుగా భావించే మేనమామ నుండి బహుమతి అందుకున్నాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “స్టార్ వార్స్ లెగోను మా అమ్మ నాకు పరిచయం చేసింది” అని తేజ్ తన బిడ్డకు దానిని బహుమతిగా ఇచ్చే అవకాశం లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. బహుమతి ధర సుమారు రూ. 1,000. 1,30,000 ఉంటుందని అంచనా. మేనమామ విజయంతో సాయిదుర్గ తేజ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు.
Also Read : Marco Movie : భయంకరంగా ఉన్న జనతా గ్యారేజ్ విలన్ ‘మార్కో’ ఫస్ట్ లుక్