Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌ సరసన ఐశ్వర్య లక్ష్మి !

సాయి ధరమ్ తేజ్‌ సరసన ఐశ్వర్య లక్ష్మి !

Hello Telugu - Sai Dharam Tej

Sai Dharam Tej: “విరూపాక్ష” మరియు “బ్రో” సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సాయి ధరమ్ తేజ్… లాంగ్ గ్యాప్ తరువాత పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ తో రోహిత్ కెపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎడారి భూమిలో పచ్చని చెట్టు ఉండడం, ల్యాండ్ మైన్‌లు చుట్టుముట్టిన దృశ్యం కనిపించుతుండటంతో ఈ సినిమా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని అనిపిస్తోంది.

Sai Dharam Tej Movies Update

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఐశ్వర్య లక్ష్మిని కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం. తను ఇప్పటికే ఈ చిత్ర సెట్స్‌ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సిద్ధం చేసిన పల్లెటూరి సెట్‌ లో తేజ్(Sai Dharam Tej), ఐశ్వర్యలతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఆసక్తికర కథతో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని ముస్తాబు చేస్తున్నారు. దీనికి ‘సంబరాల ఏటి గట్టు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. “విరూపాక్ష” మరియు “బ్రో” వంటి విజయాల తర్వాత, సాయి ధరమ్ తేజ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనితో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Also Read : Megastar Chiranjeevi: డ్రగ్స్ వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియో !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com