Sai Dharam Tej: మరోసారి దాతృత్వం చాటుకున్న సాయిధరమ్‌ తేజ్‌ !

మరోసారి దాతృత్వం చాటుకున్న సాయిధరమ్‌ తేజ్‌ !

Hello Telugu - Sai Dharam Tej

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత మెగా కుటుంబంలో సాయిధరమ్ తేజ్ ఉంటారు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. ఇటీవల తనకు యాక్సిడెంట్ జరిగిన తరువాత… సాయిధరమ్ తేజ్ కు జీవితం అంటే ఏంటో మరింత తెలిసింది. దీనితో జీవన్మరణ సమస్య ఉన్న పేదవారికి సహాయం చేయడానికి సాయిధరమ్ తేజ్ అస్సలు వెనుకాడటం లేదు. ఈనేపథ్యంలో ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను చెల్లించడం ద్వారా… తేజ్(Sai Dharam Tej) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇదే విషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు తన సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఒక పూర్తి వివరాల్లోకి వెళితే…

Sai Dharam Tej Viral

సూర్యాపేట జిల్లాలోని చార్లెట్‌ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్‌మెంట్‌ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్‌ తేజ్‌ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్‌ చేస్తే… వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్‌ మీడియా ద్వారా చెప్పాడు. సాయిధరమ్ చేసిన సాయానికి ఒక వీడియో ద్వారా ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు.

గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా‌ గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసుల కుటుంబాల సహాయార్ధం రూ. 20 లక్షల ఆర్ధిక సహాయం అందించారు. ఇలా పలు సందర్భాల్లో తన వంతు సాయం చేస్తూ… సోషల్ సర్వీస్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవల బ్రో, విరూపాక్ష సినిమాలతో మెప్పించిన సాయిధరమ్‌… ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’చేస్తున్నారు.

Also Read : Gamma Awards: దుబాయ్ వేదికగా ‘గామా’ 4th ఎడిషన్ అవార్డ్స్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com