Sai Dharam Tej: మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సాయం విషయంలో మామయ్యల మార్గాన్ని ఫాలో అయ్యే తేజ్.. తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. దీనితో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
Sai Dharam Tej…
ఈ సందర్భంగా నటి పావలా శ్యామలా మట్లాడుతూ… ‘‘మా అమ్మాయికి ఆపరేషన్ అయినప్పుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) నాకు ఫోన్ చేశారు. ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తానన్నారు. చాలా రోజులైపోయింది. నన్ను మర్చిపోయారేమో అనుకున్నా. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు’’ అని తెలిపారు. అనంతరం, ఆమె.. సాయిధరమ్‌తేజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. చనిపోదామనుకున్నా. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది. ఏడవకండి’’ అంటూ ఆయన ఓదార్చారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు సాయిధరమ్‌తేజ్ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందులోభాగంగా రూ.లక్షను ఆమెకు అందజేయడం జరిగింది.
తెలుగులో పలు చిత్రాల్లో హాస్యనటి, సహాయనటిగా కనిపించారు పావలా శ్యామల. ‘గోలీమార్’, ‘మనసంతా నువ్వే’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘మత్తువదలరా’ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఆమె తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చిరంజీవి, పవన్‌కల్యాణ్ గతంలో ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే.
Also Read : Devara-Boby Deol : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా లో ఒక ప్రత్యేక పాత్రలో యానిమల్ విలన్