Rush: ప్రముఖ దర్శకుడు, హాస్యనటుడు, నిర్మాత రవిబాబు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా ‘రష్’. ఓ రిటైర్డ్ పోలీసు అధికారిణి తన కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ కిడ్నాప్ క్రైమ్ డ్రామాలో డైసీ బొప్పన్న, కార్తిక్ ఆకృతి కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రత విభాగం ఏడీజీపీ షిఖా గోయల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Rush Movie Updates
ఇక ట్రైలర్ విషయానికి వస్తే… పోలీసు అధికారిణి కుమార్తె కిడ్నాప్ అవడం, కారు ప్రమాదంలో తన భర్త గాయపడటం లాంటి సంఘటనలతో ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తోంది ట్రైలర్. మరి తన కుటుంబాన్ని ఆమె ఎలా కాపాడుకుందో తెలియాలంటే ‘రష్’ని చూడాల్సిందే అన్నంత ఉత్కంఠగా ట్రైలర్ ను కట్ చేసారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఈటీవీ విన్‌లో విడుదల కానుంది.
Also Read : Border 2: 27 ఏళ్ళ తరువాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్ !