రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన రూల్స్ రంజన్ చిత్రం విడుదలకు సిద్దమైంది. శుక్రవారం వరల్డ్ వైడ్ గా మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆకట్టుకునే కథనం, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, మనసు దోచుకునేలా డైలాగులు, నేపథ్య సంగీతం మరింత ఆసక్తిని పెంచేలా చేసింది రూల్స్ రంజన్.
దర్శకుడు డిఫరెంట్ గా సినిమా పేరు పెట్టాడు. ఇందులో కిరణ్ అబ్బవరం నటించాడు. మనో రంజన్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. రూల్స్ ప్రకారం జీవించాలని అనుకుంటాడు. తన స్కూల్ మేట్ అయిన సనాతో స్నేహం కొనసాగిస్తాడు. దీంతో అతడి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది.
ఆ తర్వాత ఏం జరుగుతుందనే దానిపై సస్పెన్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు రత్నం కృష్ణ. రూల్స్ రంజన్ లో అభిమన్యు సింగ్ , అన్నూ కపూర్ , నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక వెన్నెల కిషోర్ నవ్వులు పూయించేందుకు సిద్దమయ్యాడు. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిద్దాం.