Rukshar Dhillon : కిరణ్ అబ్బవరం తో కలిసి నటిస్తున్న దిల్ రుబా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్(Rukshar Dhillon) సీరియస్ అయ్యారు. ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డైలాగులు కూడా మరింత హత్తుకునేలా ఉన్నాయి. కిరణ్ నటించిన క చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సినీ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేక పోయినా తన స్వంతంగా మంచి కథతో ముందుకు వస్తున్నాడు. భిన్నమైన పాత్రలతో మెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దిల్ రుబా ఈవెంట్ జరిగింది.
Rukshar Dhillon Shocking Comments
ఈ సందర్బంగా రుక్సన్ థిల్లాన్ మాట్లాడుతుండగా కొందరు ఫోటోలు తీస్తూ పోయారు. దీనిపై మొదట అభ్యంతరం తెలిపింది. అయినా అలాగే తీస్తూనే ఉండడంతో తీవ్ర అసహనానికి గురైంది. ఒక్కసారి చెబితే వినిపించు కోవాలి. పదే పదే చెప్పించు కోవడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికింది. కొందరు మీడియా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె ఓపికతోనే సమాధానం ఇస్తూ వచ్చింది. కానీ ఫోటోస్ తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా వరకు అయితే ఓకే కానీ వ్యక్తిగత పరమైన విషయాల గురించి మాట్లాడటం మంచి పద్దతి కాదంటూ తెలిపింది రుక్సర్ థిల్లాన్.
ఇదిలా ఉండగా దిల్ రుబా చిత్రాన్ని మూవీ మేకర్స్ మార్చి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అధికారికంగా. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ట్రైలర్ లాంచ్ చేశారు. స్టేజ్ మీద ఉన్నప్పుడు, మాట్లాడుతుండగా ఫోటోస్ తీస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది నటి రుక్సర్ థిల్లాన్. అన్ కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఫోటోలు తీయడం బాగోదంటూ వాపోయింది . ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : Hero Shiva Rajkumar :క్యాన్సర్ పై హీరో శివన్న అవగాహన