Ruhani Sharma : టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది హీరో, హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా.. మరికొంతమంది లవ్ ను కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇంకొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని హింట్ కూడా ఇస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు కల నిజమైంది అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా. ? తొలి సినిమాతోనే నేచురల్ గా నటించి.. ప్రేక్షకుల మనసు గెలుచున్న ముద్దుగుమ్మ రుహానీ శర్మ(Ruhani Sharma). రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అమ్మడు.
Ruhani Sharma Marriage..
చిలసౌ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. తొలి సినిమాతోనే హిట్ అందుకోవడంతో పాటు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది ఈ వయ్యారి భామ. హిమచల్ బ్యూటీ రుహానీ శర్మ(Ruhani Sharma) టాలీవుడ్ లో బిజీ నాయికగా మారుతోంది. పంజాబీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఈ బ్యూటీ చివరికి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చిలసౌ సినిమా తర్వాత ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది.
హిట్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే `డర్టీ హరి` లాంటి బోల్డ్ మూవీతో మరింత పాపులారిటీ పెంచుకుంది. చివరిగా రుహానీ శర్మ వెంకటేష్ నటించిన సైందవ్ సినిమాలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. ఈ మధ్య గ్లామరస్ డోస్ పెంచేసింది. వెకేషన్స్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. ఈ అమ్మడి ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంది.ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన స్టోరీ కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్ చేసింది. పెళ్లికూతురు గెటప్ లో ఫోటోను పెట్టిన రుహానీ శర్మ, కల నిజమైంది అని క్యాప్షన్ ఇచ్చింది. దాంతో ఈ బ్యూటీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమేనా.. లేక ఏదైనా షూటింగ్ లో భాగమా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Rashmika Mandanna : ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మిక