Ruhani Sharma : మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma). చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘ఆగ్రా’ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాను గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో ప్రదర్శించారు. ఈ మూవీపై ఇప్పటికే అనేక ప్రశంసలతోపాటు అవార్డులు కూడా వచ్చాయి.
అయితే ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.. కానీ తెలుగులోకి మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇందులో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండడమే కారణం. దీంతో తెలుగులో స్ట్రీమింగ్ చేయలేదు. మరోవైపు ఈ సినిమాను పైరసీ సైట్లలో రిలీజ్ చేశారు. కొందరు ప్రేక్షకులు ఈ మూవీలోని బోల్డ్ సన్నివేశాలు చూసి షాకయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma)ను ఈ రేంజ్ లో చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆమెను విమర్శిస్తూ నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా తన పై వస్తున్న ట్రోలింగ్స్ పై రుహానీ శర్మ(Ruhani Sharma) ఆవేదన వ్యక్తం చేసింది. తనను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదంటూ సుధీర్ఘ నోట్ షేర్ చేసింది.
Ruhani Sharma Comment
“హాయ్.. నేను నటించిన ఆగ్రా సినిమాలోని సన్నివేశాలు లీక్ అయినప్పటి నుంచి చాలా బాధగా ఉన్నాను. నా బాధను వివరించడానికి నిరుత్సాహం అనేది కూడా చిన్నమాటే. మా కష్టాన్ని, అంకితభావాన్ని మర్చిపోయి కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి చిత్రాలను రూపొందించడం పెద్ద సవాలు. అందులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. అలాంటి సినిమాలను మీ ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చాలి. కన్నీళ్లను అర్థం చేసుకోకుండా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కొన్ని సీన్స్ చూసి సినిమాపై ఓ నిర్ణయానికి రాకండి.
అలాగే నన్ను జడ్జ్ చేయకండి. ఈ సినిమాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శించారు. అది సినిమాకు దక్కిన గౌరవం. అలాగే ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్టులో పనిచేసినందుకు నాకు గర్వంగా ఉంది. మా సినిమా శైలిని గుర్తించాలని కోరుతున్నాను. కళ అనేది ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. మా శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి” అంటూ ఆ లేఖలో పేర్కొంది. ఆగ్రా సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. మరోవైపు ఈ చిత్రంలోని బోల్డ్ సన్నివేశాలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రుహానీ శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read : Hero Raviteja : హాస్పిటల్ నుంచి డిస్ ఛార్జ్ అయిన మాస్ మహారాజా