Rubina Dilaik: కవల పిల్లలకు జన్మనిచ్చిన బిగ్ బాస్ విన్నర్

కవల పిల్లలకు జన్మనిచ్చిన బిగ్ బాస్ విన్నర్

Hello Telugu - Rubina Dilaik

Rubina Dilaik: సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్-14 విన్నర్ రుబీనా దిలక్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా తనకు కవల పిల్లలు జన్మించినట్లుగా… సుమారు నెల రోజుల తరువాత ఆమె అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఆ కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు ఆమె తెలపడంతో పాటు… తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు రుబీనా(Rubina Dilaik)-అభినవ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ మాత్రం అంతకుముందే రుబీనా-అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Rubina Dilaik New Twins

ఈ సందర్భంగా బిగ్ బాస్ బ్యూటీ రుబినా… తన ఇన్‌స్టాలో… ‘మా కుమార్తెలు జీవా, ఎధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురుపురాబ్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు.’ అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు. బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాతో ప్రేమలో పడిన రుబీనా… ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత వీరిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రుబీనా నిలవగా… అభినవ్ కూడా మంచి ప్రశంసలు అందుకున్నారు.

Also Read : Lee Sun Kyun: ఆస్కార్ సినిమా నటుడు అనుమానాస్పద మృతి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com