RRR: భారతీయ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తేవడమే కాకుండా ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది. హలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సహా ఎంతోమంది అంతర్జాతీయ సినిమా ప్రముఖులను ఈ సినిమా కట్టి పడేసింది. ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా విడుదలై రెండేళ్ళు దాటినా… ప్రపంచంలో ఎదో మూలన ఇంకా ఆడుతూనే ఉంది.
RRR Movie Updates
అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను నేటివ్ అమెరికన్స్ ఎగబడి చూశారు. జపాన్ లో అయితే ఈ సినిమా ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టింది. వంద రోజుల పాటు ఫుల్ ఆక్యుపెన్సీలతో సినిమా నడిచింది. ఆ తరువాత కూడా చాన్నాళ్ల పాటు థియేటర్లలో ఈ సినిమా రన్ కొనసాగింది. ఇప్పటికీ కూడా ‘ఆర్ఆర్ఆర్’ జపనీస్ వెర్షన్ అక్కడక్కడా ఆడుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపనీస్ వెర్షన్ ఇప్పటికీ కూడా పలు థియేటర్లలో ఆడుతుండటంతో… దర్శకుడు రాజమౌళి జపాన్ పర్యటనకు వెళ్లడానికి రెడీ అయ్యాడు. మార్చి 18న ఆయన అక్కడికి వెళ్ళి.. అక్కడ ఓ ప్రముఖ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షో చూడటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన జపాన్ ప్రేక్షకులు ఆ షో టికెట్ల కోసం ఎగబడ్డారు. వేలాది మంది బుకింగ్ కోసం ప్రయత్నించగా… కేవలం నిమిషం వ్యవధిలోనే షో టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోయింది. దీన్ని బట్టి ‘ఆర్ఆర్ఆర్’కు, రాజమౌళికి జపాన్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
‘నాటు నాటు’ పాటపై ఇంగ్లీషు పాపులర్ సింగర్ ఈడ్ షీరన్ ప్రశంసలు
ఇంగ్లీష్ లో పాపులర్ సింగర్ అయినటువంటి ఈడ్ షీరన్… ‘ఆర్ఆర్ఆర్(RRR)’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ అద్భుతం అని అందులో డాన్స్ కానీ టోటల్ సినిమా కూడా చాలా నచ్చింది అని 3 గంటలు సినిమా అయినప్పటికీ తనని ఎంతో అలరించింది అని కొనియడాడు. దీనితో చిత్ర యూనిట్ ఈ కామెంట్స్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే RRR గ్లోబల్ హవా మాత్రం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పి తీరాలి. అయితే రీసెంట్ గానే ఈడ్ షీరన్ బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్పులు వేయడం కూడా వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.
Also Read : Ajith Kumar: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ !