Ram Pothineni : టాలీవుడ్ లో ఎనర్జటిక్ హీరోగా పేరు పొందాడు రామ్ పోతినేని(Ram Pothineni). తను డైరెక్టర్స్ హీరో. జయాపజయాలతో పని లేకుండానే మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు. తను పూరీ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. తర్వాత బోయపాటి శ్రీనుతో తీశాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో లవ్ , సస్పెన్స్, వినోద ప్రధానంగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో లవ్లీ బ్యూటీ మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Ram Pothineni-Bhagyashri Borse
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. దీనికి ప్రస్తుతం ఇంకా పేరు పెట్టలేదు..కానీ ఆర్ఏపీఓ22 అని నామకరణం చేశారు. రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ చేశారు. ఇవాల్టితో మూవీ షెడ్యూల్ పూర్తయిందని మూవీ మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ కు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండడంతో మూవీపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక తాజాగా డ్రాగన్ సైతం కెవ్వు కేక అనిపించేలా చేసింది.
ఇప్పుడు రామ్ తో చేస్తున్న మూవీ కావడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ యువ డైరెక్టర్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా రవి శంకర్, నవీన్ ఎర్నేని ఉన్నారు. ఇక పోతినేనికి ఇది 22వ చిత్రం. షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు వచ్చేసింది. 34 రోజుల పాటు నాన్ స్టాప్ గా డే అండ్ నైట్ షూటింగ్ చేయడం విశేషం. ఈ షెడ్యూల్ లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్ , ముఖ్యమైన టాకీ సన్నివేశాలను దర్శకుడు తీశాడు.
Also Read : సల్మాన్ ఖాన్ మూవీ రిలీజ్ వాయిదా