Rowdy Boy : విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా మారాడు. తను కీలకమైన సన్నివేశాలలో నటించేందుకు శ్రీలంకకు చేరుకున్నాడు. తన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని గౌతమ్ తిన్నసూరి తీస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ తో అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోర్సే కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ నటనకు జనం ఫిదా అయ్యారు. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది రౌడీ హీరో గురించి.
Rowdy Boy Vijay Deverakonda-Keerthy Suresh Movie
అదేమిటంటే కింగ్ డమ్ మూవీ పూర్తయిన వెంటనే ప్రముఖ నిర్మాత శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఆ సినిమా పేరు కూడా ఖరారు చేశారు. దానికి ఎవరూ ఊహించని రీతిలో రౌడీ జనార్దన్(Rowdy Janardhan) అని పేరు పెట్టారు. ఇంకా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకుండానే అంచనాలు పెరిగాయి. చాలా మంది టాలీవుడ్ లో విజయ్ దేవరకొండను అందరూ రౌడీ అని పిలుచుకుంటారు. ఆ పేరు కలిసి వచ్చేలా సినిమా టైటిల్ పెట్టారు.
త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ మూవీలో అందాల ముద్దుగుమ్మ , ఇటీవలే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్(Keerthy Suresh) నటించనుందని ప్రచారం జరుగుతోంది. దీనికి తను ఓకే కూడా చెప్పినట్లు టాక్. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కలిసి గతంలో నాగ్ అశ్విన్ తీసిన మహానటి చిత్రంలో నటించారు. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. సో కాంబో అదుర్స్ అనేలా ఉందంటున్నారు ఫ్యాన్స్. రౌడీ జనార్దన్ మాత్రం కెవ్వు కేక అనేలా ఉండబోతోందని టాక్ .
Also Read : Harish Shankar- Victory Venkatesh :హరీశ్ శంకర్ కు వెంకీ మామ ఓకే చెప్పాడా..?