ప్రముఖ నటి, ఏపీ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించింది..మెప్పించింది. ఎన్నో విజయవంతమైన మూవీస్ ఉన్నాయి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆ తర్వాత అక్కడ తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్నారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి స్థాపించి వైసీపీ పార్టీలో చేరారు. నగరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏకంగా జగన్ కేబినెట్ లో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రిగా కొలువుతీరారు ఆర్కే రోజా సెల్వమణి.
ఓ వైపు మంత్రిగా బిజీగా ఉంటూనే రోజా బుల్లి తెరపై ప్రత్యక్షం అయ్యారు. మోస్ట్ పాపులర్ షోగా పేరు పొందిన జబర్దస్త్ ప్రోగ్రాంకు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో పిచ్చా పాటి మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
తనకు మహేష్ బాబుతో నటించాలన్న కోరిక ఉందన్నారు. అయితే తల్లిగా కాకుండా అక్క లేదా వదినె పాత్రలో నటించానలి ఉందని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.