Ritu Varma : తమిళ సినీ జగత్తులో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్. తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. అంతే కాదు పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. సెల్యూలాయిడ్ మీద ఓ సినిమా ఎలా ఉండోలా చూడాలంటే , ప్రత్యేకించి పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలను పండించాలంటే భారతీ రాజా, మణి రత్నం తర్వాత గుర్తుకు వచ్చే పేరు గౌతమ్ వాసుదేవ మీనన్.
Ritu Varma Movie Updates
తను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ప్రత్యేకించి ఏజెంట్ గా విక్రమ్ , తనకు తోడుగా రీతూ వర్మ(Ritu Varma) ను తీసుకుని ద్రువ నచ్చితరమ్ అనే సినిమా తీశాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఎలా ఉండబోతోంది అనే దానిపై .
రీతూ వర్మ వరుడు కావలెను అనే తెలుగు సినిమాలో నటించింది. చాలా సింపుల్ గా , సంప్రదాయమైన పద్దతిలో ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఒదిగి పోయింది. ఇప్పుడు రీతూ వర్మ ఆశలన్నీ మీనన్ మూవీపై ఉన్నాయి. కారణం తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు కూడా ఉంటుందని ఆశ పడుతోంది.
ఎవరైనా సరే ఒక్కో దర్శకుడి గురించి చెబితే చాలు వారి వద్ద ఒక్క చాన్స్ అయినా రాక పోతోందా అనుకుంటారు. కానీ అలా కాదు శంకర్ , మణి రత్నం, నెల్సన్ దిలీప్ కుమార్, పా రంజిత్ , మీనన్ వీరి వద్ద ఒక్క చిన్న పాత్ర వస్తే చాలని అనుకుంటారు. కానీ రీతూకు ఛాన్స్ దక్కింది లక్ రూపంలో.
Also Read : Balayya Movie : నట సింహం చిత్రం ప్రారంభం