Rishab Shetty: చిన్న సినిమాగా రిలీజై… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘కాంతారా: ది లెజెండ్’. ప్రముఖ కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు రాబట్టింది. దీనితో ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ‘కాంతారా: చాప్టర్-1’ రిషబ్ శెట్టి(Rishab Shetty) తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ‘కాంతార ఏ లెజెండ్: చాప్టర్ 1’ కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో నాలుగో షెడ్యూల్ కు రెడీ అవుతోంది.
Rishab Shetty Movie Updates
దీనితో నాలుగో షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్న నేపథ్యంలో హీరో రిషబ్ దానికి అనుగుణంగా శిక్షణ తీసుకుంటున్నారు. కదంబ యుగంలో పోరాట సన్నివేశాల కోసం రిషబ్… కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కదంబ యుగంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ తొలి భాగం ఉండనుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి(Rishab Shetty) తెరకెక్కించిన సినిమా ‘కాంతారా: ది లెజెండ్’. చిన్న సినిమాగా 2022లో విడుదల అయిన ఈ సినిమా… విడుదల అయిన ఐదు భాషల్లోనూ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించి రికార్డు సృష్టించింది. దీనితో ‘కాంతారా: ది లెజెండ్’ ముందు ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి(Rishab Shetty)… ‘కాంతారా: ది లెజెండ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ సారి చిత్ర యూనిట్ మొత్తం ఏడు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ‘కాంతార(Kantara): ఎ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ వీడియోను ఇంగ్లీషుతో కలిపి మొత్తం ఏడు భాషల్లో విడుదల చేసారు. ‘కాంతార – ఏ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్‍లో రిషబ్ శెట్టి లుక్ బీభత్సంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో గెటప్ చాలా డిఫరెంట్‍గా ఉంది. దేహమంతా రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడవు జుట్టు, గడ్డంతో ఉగ్రరూపం దాల్చిన శివుడిలా రిషబ్ శెట్టి లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. కదంబల కాలంలో జన్మించిన ఓ లెజెండ్ కథగా ఫస్ట్ లుక్ టీజర్లో పేర్కొన్నారు మూవీ మేకర్స్. ఈ టీజర్ ఆరంభంలో కాంతారలో శివ (రిషబ్ శెట్టి) కనిపిస్తారు. తన తండ్రి (రిషబ్ శెట్టి) మాయమైన చోటికి వెళ్లి నిలబడతాడు. అక్కడి నుంచి చంద్రుడిని చూస్తారు. అప్పుడు ఈ లెజెండ్ (రిషబ్) ఆగమనం ఉంది. వెలుతురులో అన్నీ కనిపిస్తాయంటూ ఇంగ్లిష్‍లో వాయిస్ ఓవర్ ఉంది. దీనితో ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో అప్పట్లోనే ఓ దుమ్ము రేపింది.
Also Read : Ileana D Cruz : ఇలియానా చేసిన ఆ ఒక్క తప్పు కి తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో బ్యాన్