Rishab Shetty: ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తాజా సినిమా ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 27న సినిమాని విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి భైరవ పాత్రలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి (వాహనం) ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించారు. ఇతిహాసాలతో కూడిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈ సినిమాలో ‘బుజ్జి’ వాహనం కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ‘బుజ్జి’ వాహనంకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
Rishab Shetty…..
పాన్ ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ‘కల్కి 2898 ఏడీ’ భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ‘బుజ్జి’ వాహనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ‘బుజ్జి’ వాహనాన్ని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పుతున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ ‘బుజ్జి’ వాహనాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర తో పాటు పలువురు స్టార్ హీరోలు నటిపారు. తాజాగా ఈ ‘బుజ్జి’ వాహనాన్ని కాంతార హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కల్కి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Also Read : Producer SKN: మెగా ఫ్యామిలీకు మరో భక్త నిర్మాతగా ఎస్కేఎన్ !