Rhea Chakraborty : ఇప్పుడు నన్ను ఎవరు ఏమనుకున్నా నేను నిజాయితీగా బతుకుతున్నా

సుశాంత్‌ 2020 జూన్‌ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు...

Hello Telugu - Rhea Chakraborty

Rhea Chakraborty : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పటికీ అతని మరణం అంతుచిక్కని కథే. ఆయన ప్రేయసి రియా చక్రవర్తి(Rhea Chakraborty) ఆ కేసులో జైలుకి వెళ్లొచ్చింది. ఆ తర్వాత తన జీవితం ఎలా మారిందో చెప్పుకొచ్చింది. ‘‘ ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను.. నా జీవనాధారం ఏమిటి? అని పలువురు అడుగుతున్నారు. కొంతకాలంగా సినిమాల్లో నటించడం లేదు. మోటివేషనల్‌ స్పీకర్‌గా మారాను. తద్వారా డబ్బులు సంపాదిస్తున్నా. ఇది నా జీవితంలో చాప్టర్‌ 2 అనే చెప్పాలి. గతంలో నా లైఫ్‌లో ఏం జరిగిందో, నేను ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన బాధ. నాకు మాత్రమే తెలుసు. ఎదుటివారు ఎన్నో ఊహించుకున్నారు. అన్నీ తమకే తెలుసనుకున్నారు. నిజానిజాలు తెలియక చాలామంది నాపై విమర్శల వర్షం కురిపించారన్నారు. కొంతమంది నేను చేతబడి చేశానన్నారు. ఎదుటివాళ్లకు నచ్చినా నచ్చకపోయినా నాకు నేను నిజాయతీగా ఉన్నాను. ధైర్యంగా ముందుకు సాగుతున్నాను’’ అని రియా చక్రవర్తి తెలిపారు.

Rhea Chakraborty Comment

సుశాంత్‌ 2020 జూన్‌ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అది ఆత్మహత్యకాదంటూ ఆయన కుటుంబ సభ్యులు రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై ఆరోపిస్తూ.. కేసు పెట్టారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించడంతో ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు భావించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత, కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్‌కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చారనేది మరో ఆరోపణ. ఇలా నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే!

Also Read : Adivi Sesh : తన గొప్ప మనసును చాటుకున్న నటుడు అడివి శేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com