RGV Vyooham : పట్టువీడని ఆర్జీవీ..మరో పిటిషన్ తో హైకోర్టును ఆశ్రయించిన ‘వ్యూహం’ యూనిట్

ఈ నెల 30న వాదనలు వింటామని డివిజనల్ కోర్టు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది

Hello Telugu - RGV Vyooham

RGV Vyooham : ‘వ్యూహం’ చిత్ర యూనిట్ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. ఈ సమయంలో రివ్యూ కమిటీ నివేదికను సమర్పించడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. అయితే వారంలోగా కమిటీకి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ‘వ్యూహం’ చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నెల 30న వాదనలు వింటామని డివిజనల్ కోర్టు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

RGV Vyooham Updates

దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం(Vyooham)’ సినిమాలో చంద్రబాబును కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఘటనపై మళ్లీ విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో…తాజాగా… డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా.. మూడు కాకుండా వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Also Read : Animal OTT : ఓటీటీలోకి వచ్చిన యానిమల్.. చూసి షాక్ అయిన ఫ్యాన్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com