మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ సందర్బంగా వరుణ్ తేజ్ , లావణ్య జంటకు శుభాశీస్సులు అందజేశారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్. మీ ఇద్దరి కాపురం చల్లంగా సాగాలని కోరారు.
వరుణ్, లావణ్యలు ఇటలీలో ఉన్నారు. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా గంప గుత్తగా అక్కడికి చేరుకున్నారు. చేయాల్సిన సినిమాల షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేసుకుని పిల్లా పాపలు, పెద్దలు అంతా పెళ్లి వేడుకలకు హాజరయ్యారు.
వీరిలో ఇప్పటికే అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, భార్య, కొడుకు చరణ్, కోడలు ఉపాసన, మనుమరాలు, కూతుళ్లు అంతా కొలువు తీరారు. మొత్తంగా విమానాలలో వీరి హల్ చల్ ఆసక్తికరంగా మారింది. ఫోటోలతో సోషల్ మీడియా వైరల్ గా మారింది.
రేణు దేశాయ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పవన్ కళ్యాణ్ తో అకారణంగా విడి పోయారు. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా డీప్ గా లవ్ లో పడ్డారు వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిలు. ఇద్దరూ సినిమాలలో నటించారు.
చివరకు వీరి ప్రేమ వ్యవహారం బయటకు పొక్కడంతో ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ ఓకే చెప్పింది వీరి పెళ్లికి.