Rekha : సినీ వెండి తెరపై నిరంతరం వెలిగే జాబిలి రేఖ. తనకు ఏ పాత్ర ఇచ్చినా దానిలో వంద శాతం లీనమై పోయి నటించే అరుదైన నటి. ఎన్నో సినిమాలు. అందులో మరిచి పోలేని, వెంటాడే పాత్రలు ఎన్నో..మరెన్నో. ఏళ్లు దాటినా తన అందం చెరిగి పోలేదు. ఇంకా మరింత లవ్లీగా తయారవుతూ మెస్మరైజ్ చేస్తోంది. కభీ కభీ మూవీలో అమితాబ్ తో నటించిన రేఖ(Rekha) ఎప్పటికీ మరిచి పోలేని విధంగా వెంటాడుతూనే ఉంది. మహిళా దినోత్సవం సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సీనియర్ నటి.
Senior Actress Rekha Comment
తన తండ్రి ఎవరో కాదు ప్రముఖ నటుడు శివాజీ గణేషన్. సినిమా రంగంలోకి అనుకోకుండా ప్రవేశించింది. తనకు అంతులేని ఆస్తులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. తను అమితాబ్ ప్రేమలో పడింది. కానీ పెళ్లి దాకా వచ్చి ఆగి పోయిందని ప్రచారం జరిగింది. తను నటించిన ఉమ్రాజావ్ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఓ మైలు రాయి అని చెప్పక తప్పదు. తన నికర ఆస్తులు దాదాపు రూ. 300 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా.
ఇది పక్కన పెడితే నటిగా తను ఎవరూ చేరుకోలేని స్థాయిలో ఉంది. ఇటు సినిమాలలో అటు బుల్లితెరపై న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వస్తోంది రేఖ. తను నిండైన ఆత్మ విశ్వాసానికి ప్రతీక. అంతే కాదు ఎవరికీ తల వంచని మనస్తత్వం తన స్వంతం. అందుకే రేఖను వెండి తెరకు దక్కిన అద్భుత వరం అంటారు.
Also Read : Womens Day Sensational :టాప్ హీరోయిన్స్ నెట్టింట్లో వైరల్