Rekha Gupta : ఢిల్లీ – రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరారు రేఖా గుప్తా(Rekha Gupta). ఆమె నాలుగో మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. గతంలో బీజేపీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ పార్టీ నుంచి షీలా దీక్షిత్, ఆప్ నుంచి అతిషి సింగ్ సీఎంలుగా పని చేశారు.
Rekha Gupta As a Delhi New CM
ప్రస్తుతం తను ఊహించని రీతిలో ఎర్రకోట పీఠాన్ని అధీష్టించారు. నిన్నటి వరకు ఎవరు సీఎం అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరకు బీజేపీ శాసన సభ పక్షం ఏకగ్రీవంగా రేఖా గుప్తాను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. దీంతో ఆమెనే సీఎం అని తేలి పోయింది.
హస్తిన లోని రాం లీలా మైదానంలో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్, పూరి, పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు పర్వేశ్ వర్మ, కపిల్ శర్మ, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అంతిమంగా ఎన్డీయేదే విజయమన్నారు. ఇక మిగిలింది బీహార్, బెంగాల్ అని అక్కడ కూడా జెండా ఎగుర వేస్తామన్నారు.
Also Read : Rakul Preet Singh Luxury :లగ్జరీ కంటే సింపుల్ గా ఉండటమే ఇష్టం