Regina Cassandra: ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా(Regina Cassandra). మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అల్లు శిరీష్ తో కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ తో ప్రేమలో పడినట్లు… త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఆ తరువాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్ గా రొమాన్స్ చేస్తుందని టాక్ నడిచింది. మధ్యలో హీరో సందీప్ కిషన్ తో డేటింగ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ తమిళ బ్యూటీకు అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా వెబ్ సీరీస్ ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి.
Regina Cassandra Marriage Updates
సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘విడమయూర్చి’ సినిమాలో నటిస్తున్నారు.
Also Read : Khans Trio Dance: నాటు నాటు పాటకు బాలీవుడ్ ‘ఖాన్స్ త్రయం’ స్టెప్పులు !