Redin Kingsle: ప్రముఖ తమిళ హాస్య నటుడు రెడిన్ కింగ్స్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన సీరియల్ నటి సంగీతను వివాహామాడారు. 46 ఏళ్ళ వయసులో ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల జైలర్ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రెడిన్ కింగ్స్లీ(Redin Kingsle)… దక్షిణాదిలో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Redin Kingsle – రెడిన్ కామెడీ స్ట్రైలే వేరు
రెడిన్ కామెడీ స్టైలే వేరు. అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘కొలమావు కోకిల’ చిత్రంతో ఆయన కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు. శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ‘డాక్టర్’లోని నటనకుగాను ఆయన ఉత్తమ హాస్యనటుడిగా ‘సైమా’ అవార్డు దక్కింది. విజయ్ ‘బీస్ట్’, విజయ్ సేతుపతి ‘కాతువాకుల రెండు కాదల్’ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌తో మరింత గుర్తింపు వచ్చింది. ఇక సంగీత విషయానికొస్తే… సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించిన సంగీత… అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాల్లో చేసింది. ఒక సినిమా షూటింగ్ లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి… పెళ్లికి దారి తీసింది.
Also Read : Neha Shetty: క్వాలిటీ ముఖ్యం అంటున్న డిజే టిల్లూ బ్యూటీ