Reba Monica John: ‘సామజవరగమన’ సినిమాలో మంచి నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ . అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్ చాన్స్ లభించిందట. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు రెబ్బా మౌనికా జాన్ ను లోకేష్ కనగరాజ్ ఎంపిక చేశారని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్ తో స్క్రీన్ స్పేస్ అంటే ఆమెకు కెరీర్ పరంగా ఓ సూపర్‌చాన్స్ కావొచ్చు అని సినిమా విశ్లేషకుల టాక్.
Reba Monica John Movie Updates
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’. ఈ సినిమాని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. దీనికి అనిరుధ్ సంగీతమందిస్తుండగా… గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, శ్రుతీహాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. సత్యరాజ్, మహేంద్రన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Also Read : Huma Qureshi: డిటెక్టివ్ రూహిగా వస్తున్న హుమా ఖురేషీ !