Razakar : తెలంగాణకు ఘనమైన వారసత్వం ఉంది. అద్భుతమైన చారిత్రిక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. వేలాది మంది బలిదానాలు, ఆత్మ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైంది. కోట్లాది మంది ఒక్కటై ఒకే నినాదమై అలుపెరుగని రీతిలో పోరాటాలు చేశారు. చరిత్ర సృష్టించారు. విస్మరించలేని రీతిలో ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Razakar Movie Trending at OTT
ఆత్మహత్యలు, దారుణాలు, ఆకలి చావులు, అత్యాచారాలు లెక్కలేనన్ని తెలంగాణ గడ్డపై కొనసాగాయి. దీనికి సాక్షీభూతంగా నిలిచింది రజాకార్లు సాగించిన దాష్టీకాలు. దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. ఆశించిన దానికంటే రెస్పాన్స్ వచ్చింది. చరిత్రను కళ్ల ముందు కనిపించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మూవీ మేకర్స్.
ఇందులో కీలకమైన పాత్ర పోషించారు అనసూయ భరద్వాజ్. యాంకర్ గా, నటిగా నిత్యం వార్తల్లో నిలిచే ఆమె ఉన్నట్టుండి రజాకార్(Razakar) మూవీలో తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమా ద్వారా సీరియస్ పాత్రలు కూడా తాను చేయగలనని నిరూపించుకుంది.
తాజాగా రజాకర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ అయిన వెంటనే పెద్ద ఎత్తున చూడడం విస్తు పోయేలా చేసింది. కేవలం ఎంటర్టైన్మెంట్ , రొమాన్స్, హింసకు ప్రయారిటీ ఉన్న సినిమాలను ఆదరిస్తున్న జనం ఉన్నట్టుండి చరిత్రాత్మక కథకు చిత్ర రూపం అందించిన రజాకార్ ను ఆదరించడం విస్తు పోయేలా చేసింది. అన్ని భాషల్లో రజాకార్ ను ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ చేశారు.
Also Read : Thandel Exclusive :తండేల్ తడాఖా కలెక్షన్స్ ధమాకా