సెంకడ్ హ్యాట్రిక్ కు సిద్ధమవుతున్న గోపీచంద్-రవితేజ
Raviteja-Gopichand : మాస్ మహారాజ్ రవితేజ, యువ దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలుపుతున్నారు. డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి ఈ ద్వయం నాలుగో సినిమాకు సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సెల్వ రాఘవన్, ఇంధూజ రవిచంద్రన్ కీలక పాత్రలు పోషించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నటించేందుకు హీరోయిన్ అరుల్ మోహన్ పేరును పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సినిమా ముహూర్తపు షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించగా నవంబరు చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. వాస్తవ ఘటనలు ఆధారంగా ఓ వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తొలి షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.
Raviteja-Gopichand – హిట్ కాంబోగా రవితేజ-గోపీచంద్
యువదర్శకుడు గోపీచంద్(Gopichand), మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో గతంలో ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాలు వచ్చాయి. వరుసగా మూడు సినిమాలు హిట్ టాక్ సంపాదించుకోవడంతోపాటు మాస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఈ కాంబోను నిలబెట్టింది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో… ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.
Also Read : Sai Pallavi: రామ్చరణ్ సరసన సాయిపల్లవి ?